logo MP3
head_logo

Sooryagayathri Sri Anjaneya Dandakam Скачать

main img

Sooryagayathri

Sri Anjaneya Dandakam

89 Прослушиваний
05:43
Все треки Sooryagayathri
Слушать
Скачать песню

Текст песни

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రము

నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి
నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి
నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్

నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనా దేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే
దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై

స్వామి కార్యార్థమై యేగి, శ్రీరామసౌమిత్రులం జూచి
వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి
యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి

కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై
లంకకేతెంచియున్
లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్
భూమిజన్ జూచి యానందముప్పొంగ
ఆ యుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి
సుగ్రీవుడా యంగద జాంబవంతాది వీరాదులన్ గూడి
ఆ సేతువున్ దాటి, వానరుల్ మూకలై పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా

రావణుడంత కాలాగ్ని రూపోగ్రుడై
కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ
అప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదులన్ వీరులన్ బోర
శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా
అంత లోకంబులానందమైయుండ నవ్వేళలన్
విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి

సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరామునితో చేర్చి, అయోద్యకున్ వచ్చి
పట్టాభిషేకంబు సంబ్రహామైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించి
శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నిన్నుసేవించి, నీకీర్తనల్ చేసితే
పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే
సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే
వానరాకార యోభక్తమందార యోపుణ్యసంచార
యోధీర యోశూర యో వీర నీవే
సమస్తంబుగా నొప్పి యా తారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్
స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి

శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు
నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై
రామ నామాంకితధ్యానివై
బ్రహ్మవై
బ్రహ్మ తేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత
ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ పిశాచంబులన్
శాకినీ ఢాకినీత్యాదులన్
గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి, నేలం బడంగొట్టి
నీ ముష్టిఘాతంబులన్, బాహు దండంబులన్, రోమ ఖండంబులన్ ద్రుంచి
కాలాగ్ని రుద్రుండవై
నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్ చున్, దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి
ఓ ఆంజనేయా నమస్తే
సదా బ్రహ్మచారీ నమస్తే
ప్రపూర్ణార్తి హారీ నమస్తే
వాయుపుత్రా నమస్తే
నమో నమ:

На странице доступен трек Sri Anjaneya Dandakam от Sooryagayathri. Слушайте онлайн или загрузите в один клик бесплатно на свое устройство.